స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ పెళ్లికి అటెండ్ అయ్యారు. హైదరాబాద్ లోనే జరిగిన ఈ పెళ్లి వేడుకకు అల్లు అర్జున్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో పనిచేసిన శిరీష్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్న బన్ని అతన్ని కొరియోగ్రాఫర్ దగ్గరకు పంపించారట.


శిరీష్ ఇప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. అతని పెళ్లికి బన్ని వచ్చిన దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లికి బన్ని వచ్చాడని తెలియగానే పెళ్లికి వచ్చిన బంధువులంతా బన్నిని చూసేందుకు ఎక్సైట్ అయ్యారట. అంతేకాదు దంపతులు అల్లు అర్జున్ కళ్లాకు నమస్కారం చేయడంతో వారిని మనస్పూర్తిగా ఆశీర్వదించాడట బన్ని.


నా పేరు సూర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈమధ్యనే త్రివిక్రంతో సినిమా షురూ చేశాడు. మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసొచ్చాడు. త్రివిక్రం సినిమా రెండో షెడ్యూల్ త్వరలో మొదలు కాబోతుంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అవుతుంది.


పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అలకనంద, నాన్న నేను అని టైటిల్ పరిశీలణలో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉంటుందని తెలుస్తుంది. మహేష్ కాదన్న కథతోనే సుక్కు బన్నితో ఆ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: