బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్- బద్లాపూర్- జాలీ ఎల్.ఎల్.బి లాంటి బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు సౌత్ లో ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన గ్యాంగ్ స్టర్ మూవీ కాలా తో దక్షిణాదికి పరిచయమైంది. వీటితో పాటు ఒక హాలీవుడ్ సినిమాలోను నటించి మంచి పేరును సంపాదించుకుంది. అలాగే హ్యూమా రీసెంట్‌గా నటించిన వెబ్ సిరీస్ లైలా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం హ్యూమా హాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ ని అందుకుంది. అయితే ఆ ఆఫర్ ఎంతో క్రేజీ ప్రాజెక్ట్ అని సమాచారం.


300 - మ్యాన్ ఆఫ్ స్టీల్- సక్కర్ పంచ్- బ్యాట్ మేన్ వర్సెస్ సూపర్ మేన్ (డాన్ ఆఫ్ జస్టిస్) వంటి భారీ హాలీవుడ్ సినిమాలని నిర్మించిన జాక్ స్నైడర్ దర్శకత్వంలో ఈ అవకాశం దక్కించుకుంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో బాగా పాపులర్ అయినప్పటికి హ్యూమాకి ఈ ఛాన్స్ రావడం బాలీవుడ్‌లో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లాస్ వేగాస్ బ్యాగ్డ్రాప్‌లో రూపొందించే ఈ సినిమాకి `ఆర్మీ ఆఫ్ ది డెడ్` అనే టైటిల్ ని ప్రకటించారు.


హాలీవుడ్ సినిమాలో పలువురు క్రేజీ హాలీవుడ్ టాప్ స్టార్లు నటిస్తున్నారు. పైగా ఇది జాంబీ మూవీ. రెసిడెంట్ ఈవిల్ తరహాలో జాక్ స్నిడర్ ఓ ఛాలెంజింగ్ జోనర్ తో సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేవ్ బాటిస్టా- అన్నా డీ లా రెగురా- ఎల్లా పుర్నెల్- థియో రోస్సీ వంటి అంతర్జాతీయ స్టార్లు నటిస్తున్న ఈ సినిమాలో హ్యూమా అత్యంత కీలకమైన పాత్రలో నటించనుందని బాలీవుడ్ మీడియా సమాచారం. ప్రియాంక చోప్రా, హ్యూమా ఖురేషి లాగానే మరికొందరు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ హాలీవుడ్ మూవీస్ లో ఛాన్స్ దక్కించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని మరో లేటెస్ట్ అప్డేట్.


మరింత సమాచారం తెలుసుకోండి: