మెగాస్టార్ చిరంజీవి అండదండలతోనే వట్టి కళ్యాన్ కాస్త పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవగలిగాడు. పవర్ స్టార్ గా తనకంటూ విపరీతమైన ఫాలోయింగ్ వచ్చాక అన్నని మించిన తమ్ముడు అన్న కామెంట్స్ కూడా వినపడ్డాయి. అయితే పవన్ కు మాత్రం తన స్థాయి ఏంటి అన్నది తెలుసు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వలేదు.


అసలు ఈ క్రేజ్.. ఫాలోయింగ్ ను పట్టించుకునే వాడే అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అన్నదమ్ములైన చిరు పవన్ కలిస్తేనే అదో పెద్ద సంచలనం అన్నట్టుగా ఉండేది. అయితే చిరంజీవి పార్టీ పెట్టిన సందర్భంలో సినిమాలు చేస్తున్న పవన్ మెగా ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఆ టైంలోనే పవర్ స్టార్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.   


ప్రజారాజ్యం పార్టీ కథ ముగిసిన తర్వాత చిన్నగా మనకు సినిమాలే కరెక్ట్ అని చిరంజీవి మళ్లీ మెగాస్టార్ గా మారి ఖైది నంబర్ 150 సినిమా తీసి హిట్టు కొట్టాడు.. అప్పటికి ఇప్పటికి మెగాస్టార్ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఆ సినిమాతో తెలిసింది. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో తేడా ఉండదని ఆయన డైలాగ్ నే వాడితే ఖైది నంబర్ 150 సినిమా చిరు స్టామినాని తెలియచేస్తుంది. ఇక సినిమాల్లో బీభత్సమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2014లో పోటీ చేయకుండా 2019లో ఎన్నికల్లో నిలబడ్డాడు. 


అధినేత కూడా గెలవలేని పరిస్థితి అన్న పేరు మూటకట్టుకున్నాడు. అఫ్కోర్స్ పార్టీ విధివిధానాలు వేరు.. కాని ఇప్పుడు జనసేనతో పోల్చితే అప్పుడు ప్రజారాజ్యం బెటరని కొందరి అభిప్రాయం. అయితే రాజకీయం అంత త్వరగా అర్ధమయ్యే సబ్జెక్ట్ కాదు నిన్నటిదాకా సినిమాల్లో నటించిన పవన్ కు నిజ జీవితంలో పాలిటిక్స్ ఏంటో తెలియాలి.. ఈ విషయంలో చిరంజీవి సలహా తీసుకుని ఆయనలా కాకుండా జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అన్నతో చర్చిస్తే బెటర్ అన్నది కొందరి మాట. అయితే రాజకీయంతో తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్న చిరంజీవి పవన్ కు సలహా ఇస్తాడా.. అన్న ఇచ్చిన సలహా పవన్ పాటిస్తాడా అన్నది మళ్లీ సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. జనసేన ఓటమికి చిరు రియాక్షన్ ఏంటి.. తమ్ముడిని కనీసం సమర్ధించడానికి కూడా చిరు ఎందుకు వెనుకాడుతున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.      



మరింత సమాచారం తెలుసుకోండి: