కాజల్ అగర్వాల్.. పంజాబీ బ్యూటీ... లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ మగధీర సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ పెంచుకుంది.  పంచదార బొమ్మ బొమ్మా.. అంటూ కవ్వింపజేసుకున్న ఈ చందమామ.. ఆనతి కాలంలోనే టాప్ హీరోలందరితో కలిసి నటించింది.  


సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంది.  అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సింపుల్ గా పారితోషికం తగ్గించుకొని సినిమాలు చేసింది.  ఇంకేముంది అవకాశాలు వెట్టుకుంటూ వచ్చాయి.  వచ్చిన వాటిని వదలకుండా చేసింది.  అయితే, మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 తరువాత ఆమెకు ఆ రేంజ్ లో హిట్ లేదు.  చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నా లాభం లేకపోయింది.  


అనుకోకుండా ఆమెకు శంకర్ నుంచి పిలుపురావడం... కమల్ తో సినిమా అనడం... వెంటనే ఒకే చెప్పెయ్యడం జరిగిపోయింది.  సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు.  మరి ఏమైందో ఏమో తెలియదు.  హఠాత్తుగా సినిమా ఆగిపోయింది.  ఇప్పటి వరకు దానిగురించి చర్చ లేదు.  జనవరిలో ప్రారంభమయ్యి .. కొన్ని రోజులు షూట్ చేసుకున్న ఈ సినిమా గురించి ఆరు నెలల నుంచి ఎలాంటి సమాచారం లేదంటే.. అర్ధం ఏంటి.. 


పెద్ద సినిమా కదా.. చేస్తే.. మళ్ళీ అవకాశాలు వస్తాయి కదా అనుకుంది.  ఇప్పుడేం జరిగింది.  మొదటికే మోసం వచ్చింది.  దీంతో కాజల్ భారతీయుడు 2 నుంచి తప్పుకోవాలని చూస్తోంది.  మరి దీనికి శంకర్, నిర్మాతలు ఒప్పుకుంటారా లేదా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: