బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ హీరో తనకంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్న హీరో. అక్షయ్ కుమార్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటూ రియలిస్టిక్ స్టంట్ లతో ప్రేక్షకులను అలరించాలని ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక సినిమాలను చేయటానికి ఎక్కువ ఉత్సాహం చూపుతుంటారు. అంతేకాకుండా స్వతహాగా అక్షయ్ కుమార్ కి మార్షల్ ఆర్ట్స్ రావడంతో తన సినిమాలలో చాలా యాక్షన్ సన్నివేశాలలో అలవోకగా ఏం చేయడానికైనా రెడీ అయిపోతాడు.
Image result for akshay kumar
ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ ఖాన్ లని క్రాస్ చేసుకొని నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూర్యవంశీ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో కార్తి హీరోగా తెరకెక్కిన ఖాకీ సినిమాకి ఇది హిందీ రీమేక్. తాజాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అక్షయ్ కుమార్ ఓ రిస్కీ స్టంట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Image result for akshay kumar helicopter stunt
ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇందులో అక్షయ్ కుమార్ గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్ క్రింద వేలాడుతూ ఉండగా బైక్ పైన రోహిత్ శెట్టి అతన్ని చేజ్ చేస్తున్నట్లు ఉంది. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో రావడంతో తెలుగు సినిమా ప్రేక్షకులు అక్షయ్ కుమార్ లాగా ఏ తెలుగు హీరో చేయలేరని కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: