టాలీవుడ్ హీరో యువసామ్రాట్ నాగార్జున కొన్నేళ్ల క్రితం వచ్చిన మనం, సోగ్గాడే చిన్ని నాయనే, ఊపిరి సినిమాల విజయాలతో తన మార్కెట్ ని మరింత పెంచుకున్నారు అనే చెప్పాలి. అయితే ఆపై వచ్చిన ఓం నమోవెంకటేశాయ, రాజుగారి గది 2, దేవదాసు సినిమాలు పెద్దగా ఆడలేదని చెప్పాలి. ఇక కొంత విరామం తరువాత ప్రస్తుతం నాగ్ మన్మధుడు-2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందా అని గత కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న నాగ్ ఫ్యాన్స్ కు నేడు గూడ్ న్యూస్ అందింది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా టీజర్ ని ఈనెల 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాసేపటి క్రితం పలు మీడియా వర్గాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. 

2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగ్ నటించిన సూపర్ హిట్ మూవీ మన్మధుడు. అప్పట్లో ఆ సినిమా మంచి క్లాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మదిని దోచింది. అయితే మళ్ళి ఇన్నాళ్లకు దానికి సీక్వెల్ వస్తుండడంతో ఒక్కసారిగా అటు ప్రేక్షకుల్లో, అటు టాలీవుడ్ వర్గాల్లో ఆ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా సమంత, అక్షర గౌడ, కీర్తి సురేష్ లు ప్రత్యేక క్యామియో పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక మన్మధుడు సినిమాని తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించిన నాగార్జున, ఈ సినిమాని కూడా తన సొంత బ్యానర్ తో పాటు వయాకామ్ 18 పిక్చర్స్ అలానే ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా అత్యంత భారీ ఖర్చు, మరియు సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 మూవీ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కూడా మన్మధుడు మాదిరే అలరించే ఎంటర్టైన్మెంట్ తో సాగుతూ అండర్ కరెంట్ గా మంచి ఎమోషన్ తో నడుస్తుందని సమాచారం. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి, దేవదర్శిని, మరియు నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: