యంగ్ హీరోయిన్స్ దగ్గర్నుంచి ఆంటీ హీరోయిన్స్ వరకు అందరు సినిమాలు ఉన్నా లేకపోయినా ఉంటే షూటింగ్స్ లేదంటే జింలో గడుపుతున్నారు. అన్నీ ఇండస్ట్రీలలో ఉన్న హీరోయిన్స్ అందరికి ఇదే ఫ్యాషన్ అయిపోయింది. దీనికి వర్కౌట్స్ అనే ఓ నేమ్. సరే యంగ్ హీరోయిన్స్ అంటే తమ ఫిజిక్ ని కాపాడుకోవడంకోసం వర్కౌట్స్ చేస్తున్నారంటే ఓ అర్థమముంది. కానీ 40 ఏళ్ళు దాటిన హీరోయిన్స్ కూడా ఏమనాలో మరి. మలైకా అరోరా.. మందిరా బేడి.. శిల్పా శెట్టి..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదిగా ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో క్రేజీ హీరోయిన్ చేరింది. తనే అమీషా పటేల్.


బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ డెబ్యూ మూవీ 'కహో న ప్యార్ హై' సినిమాతో ఇరవై ఏళ్ళ క్రితం బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'బద్రి' లో కూడా హీరోయిన్ గా నటించింది.  మొదట్లో కెరీర్ బాగానే ఉంది కానీ గత కొన్నేళ్ళుగా సకసస్స్లేమీ లేక అల్లాడిపోతోంది..  అయితే కెరీర్ తో సంబంధం లేకుండా వర్కౌట్స్ చేయడం సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం.. ఇలా కాలం గడుపుతూ ఉంది. ఈమధ్య ఫేస్ లో కాస్త వయసు తెలుస్తోంది కానీ ఫిజిక్ పరంగా మాత్రం పరెఫెక్ట్‌గా ఉంది. తాజాగా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూస్తే యంగ్ హీరోన్స్ కి కాస్త అటు ఇటు గా బానే వుంది గాని మరి ఛాన్స్ లే రావడం లేదు. 


పాపం ఎంతగా హాట్ పిక్స్ ని పోస్ట్ చేస్తున్నా కూడా ఎవరు అంతాగా రెస్పాండ్  అవటంలేదని తెగ ఫీలవుతుందట. ఏదేమైనా హీరోయిన్స్ కి లైఫ్ టైం తక్కువనడానికి అమీషాది మరో లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇక సినిమాల విషయానికి వస్తే అమీషా ప్రస్తుతం 'దేశి మ్యాజిక్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.   ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్ అని బాలీవుడ్ మీడియా సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: