దాదాపు 300 కోట్ల బడ్జెట్తో టాలీవుడ్లో నిర్మాణం జరుపుకోబోతున్నాయి సాహో సైరా నరసింహారెడ్డి సినిమాలు. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఉన్నప్పటికీ ఈ సినిమా డైరెక్టర్ల వల్ల అనుకున్నంత రేంజ్ క్రేజ్ రాబట్టుకోలేకపోతున్నాయి ఈ సినిమాలు. దర్శకుడు సురేందర్ రెడ్డి సుజిత్ ఇద్దరూ ఇలాంటి సినిమాలు తీసిన అనుభవం లేకపోవటంతో సమస్య మొదలైంది.

నిజానికి సాహో సైరా సినిమాలకు ఒక్క తెలుగు నుండే 40 నుండి 50 కోట్లు నిర్మాతలు ఆశిస్తున్నారు. టీవీ చానెళ్ళు డిజిటల్ స్ట్రీమింగ్ వల్ల అనుకున్నంత టీఆర్పీ రేటింగులు సాధించలేకపోతున్నాయి. కాబట్టి అంత రేటు పెట్టడానికి టీవీ చానెళ్ళు ఆసక్తి చూపించడం లేదు.

సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా ఎక్కువ రేట్లు పెట్టి సినిమాను తీసుకుంటే ఒకవేళ సినిమాకు నెగటివ్ టాక్ వస్తే మాత్రం డిస్టిబ్యూటర్లు ఆ స్థాయి నష్టాలు భరించటం అంత తేలిక కాదు. సినిమా బడ్జెట్ అదుపులో ఉంటే రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు. ఈ ఇద్దరు డైరెక్టర్ల టాలెంట్ ను తక్కువ చేయలెము కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమాలు ఎలా డీల్ చేసి ఉంటారో అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: