నందమూరి బాలకృష్ణ తనయుడిగా టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అనుకున్న మోక్షజ్ఞ డెశిషన్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అనుకున్న మోక్షజ్ఞ అసలు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదన్నది హాట్ న్యూస్. కేవలం బాలకృష్ణ ఫోర్స్ మీదే మోక్షజ్ఞ యాక్టింగ్, డ్యాన్స్ క్లాసులకు వెళ్లాడట.


తిరిగి వచ్చాక మళ్లీ ఎప్పటిలానే తన రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నాడట. మొన్నామధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్ అంటూ ఓ ఆర్టికల్ కూడా వేసింది. ఆరు నెలలుగా మోక్షజ్ఞ ఆ కాఫీ షాప్ లోనే స్నేహితులతో బాతాకాని కొడుతున్నాడట. ఓ పక్క అతని సినిమా ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


అయితే అసలు విషయం ఏంటంటే మోక్షజ్ఞ సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదట. బిజినెస్ చేయాలన్నది అతని ఆలోచనలో ఉందట. హీరోగా చేయడం తనకు ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ కు ఇది షాక్ ఇచ్చే వార్తే అని చెప్పొచ్చు. బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ సత్తా చాటుతాడని అనుకుంటే ఇలా సినిమాలకు దూరమవడం ఆశ్చర్యంగా ఉంది.


ఎలాగోలా మోక్షజ్ఞను ఒప్పించి సినిమాల్లో ఎంట్రీ ఇప్పించాలన్నది బాలకృష్ణ తపన పడుతున్నారట. మోక్షజ్ఞ మాత్రం సినిమాల కన్నా బిజినెస్ బెటర్ అంటున్నాడట. ఇప్పటికే స్టార్ వారసులు నాగార్జున తనయుడు నాగ చైతన్య, అఖిల్ సినిమాలు చేస్తుండగా బాలకృష్ణకి తన వారసుడు మాత్రం షాక్ ఇచ్చేలా ఉన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: