ఎన్నికలలో ఓటమి తరువాత ఆ షాక్ నుండి తేరుకున్న పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలోని ‘జనసేన’ ఆఫీసుకు వచ్చి జనసైనుకుల మధ్య బిజీగా కాలం గడిపాడు. ఈసారి జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ‘జనసేన’ అభ్యర్ధులు అందరినీ పిలిపించి వారందరితో ఒకోక్కరితో ఏకాంతంగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పినట్లు సమాచారం. 

అంతేకాదు ఈ ఎన్నికలలో జనసేనకు ఎదురైంది ఓటమి కాదనీ ఒక అనుభవం అనుకోవాలి అనీ చెపుతూ ప్రజలు తమకు సుమారు ఏడు శాతం ఓట్లు వేసారు అంటే వారంతా ‘జనసేన’ ను గుర్తించినట్లే అన్న తన అభిప్రాయాలను తెలియచేసి ‘జనసేన’ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ‘జనసేన’ కు ఇలాంటి ఫలితం రావడం వెనుక రాజకీయ దుష్టశక్తులు కారణం అని అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. 

ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ తాను సుధీర్గ రాజకీయ పోరాటం చేయబోతున్న విషయాలను వివరించి తనతో నడిచే వారంతా పది సంవత్సరాల సుధీర్ఘ పోరాటానికి సిద్ధం అవ్వమని పిలుపును ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా పవన్ ఈ సందర్భంగా తన మనసులోని మరొక మాటను బయటపెట్టి జన సైనికులకు షాక్ ఇచ్చినట్లు సమాచారం. 

త్వరలో జనసేన ప్రచారం కోసం ఒక పక్ష పత్రికను తాను ప్రారంభిస్తున్న విషయాన్ని వివరిస్తూ ఆ పత్రికలో తాను చేయబోతున్న రాజకీయ పోరాటం ఆలోచనలను వివరించడమే కాకుండా వర్తమాన రాజకీయాల పై తన అభిప్రాయాలు విశ్లేషణలు ఉంటాయి అన్నక్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పటికే పవన్ జనసేన కోసం ప్రారంభింప బడ్డ ‘99’ టివి ఛానల్ పరిస్థితి అయోమయంగా ఉంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకు రాబోతున్న ఈ పక్ష పత్రిక ఎంత వరకు పవన్ పోగొట్టుకున్న ఇమేజ్ ని తిరిగి తెచ్చి పెట్టగలుగుతుంది అన్నది ప్రశ్నార్ధకం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: