సమంత నిత్యం ఏదోఒక ఫొటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా సమంతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "వారికి అర్థం కాదు.  నేను కార్డియో చెయ్యను.  ఇదెందుకు చేస్తామంటే ఈ కసరత్తులు చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది. #వెయిట్ ట్రైనింగ్ వుమన్ #స్క్వాట్ ది హెవీ #వుమన్ విత్ పవర్". 


ఫోటోలో రెడ్ కలర్ ప్యాంట్.. బ్లాక్ కలర్ టాప్ ధరించి ఎక్సర్ సైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.  వెనక్కు తిరిగి ఉండడంతో ఆమె షోల్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో కనిపిస్తోంది.  వెయిట్స్ విషయంలో సామ్ తో పోటీ పడగలిగిన హీరోయిన్ మరొకరు లేరనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమంతా ఈ ఫోటో ను పోస్ట్ చేసిన మూడు గంటల్లోపే మూడున్నర లక్షల లైక్స్ వచ్చాయి.


కామెంట్లకు లెక్కే లేదు. "బీస్ట్ మోడ్ లో సామ్".. "జిమ్ క్వీన్ సమంతా".. "బ్యూటిఫుల్ బాడీ బిల్డర్".. "పవర్ఫుల్ వుమన్" అంటూ వెరైటీ కామెంట్లు పెట్టారు.కొందరేమో ఇలాంటి ఎక్సర్ సైజులు చేయవద్దని.. కార్డియో చెయ్యమని కోరారు. అయినా సమంతాకు వెయిట్ ట్రైనింగ్ ఇష్టం అంటుంటే.. వెయిట్లు ఎత్తవద్దని సలహా ఇస్తారెందుకో?  ఇక సినిమా విషయానికి వస్తే సామ్ కొత్త సినిమా 'ఓ బేబీ' జులై 5 న రిలీజ్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: