అల్లు అర్జున్ 19 వ సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా ప్రారంభం అయ్యింది.  త్రివిక్రమ్ సినిమాకు గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నాడు.  పక్కా స్క్రిప్ట్ ఉండటంతో తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.  ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.  అల్లు అర్జున్ తో ఆమెకు ఇది రెండో సినిమా.  పూజా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన డీజే సినిమా హీరో కూడా బన్నీనే కావడం విశేషం. 


సంక్రాంతి రేసులో నిలిచేందుకు యూనిట్ ప్రయత్నం మొదలు పెట్టింది.  ఇందులో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉన్న సంగతి తెలిసిందే.  రెండో హీరోయిన్ గా మొన్నటి వరకు వేరే హీరోయిన్ అనుకున్నారు.  కానీ, రెండో హీరోయిన్ చిత్రలహరి సినిమా హీరోయిన్ నివేతా పేతురాజ్ ను తీసుకున్నారట. దీన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.  


నివేత కోలీవుడ్ లో దూసుకుపోతున్నది.  భారీ చిత్రాలు చేస్తూ, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరోయిన్ టాప్ హీరోయిన్ గా ఎదిగేందుకు ట్రై చేస్తున్నది.  ఇది ఆమెకు బెస్ట్ అవకాశంగా చెప్పొచ్చు.  బన్నీతో సినిమా హిట్ అయ్యింది అంటే.. టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: