సీమలో మగాడు లేడా అని తెలంగాణ శకుంతల అడిగినప్పుడు నేనున్నాను నాయనమ్మ అంటూ తేజ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి హాళ్లు విజిల్స్ తో దద్దరిల్లిపోయాయి. 17 ఏళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్రంలో నటించిన చిన్న ఇంద్రసేనారెడ్డి ఈ తేజ. అప్పటిదాకా ఉన్న రికార్డులను ఒంటిచేత్తో దులిపేసిన ఈ బ్లాక్ బస్టర్ ని ఫ్యాన్స్ చాలా ప్రత్యేకంగా ఫీలవుతారు. అందులో మొదటి పావు గంట వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తేజను కూడా అదే రీతిలో గుర్తు పెట్టుకుంటారు.

అంతకు ముందే చూడాలని ఉంది లాంటి సినిమాల ద్వారా పాపులర్ అయిన తేజ ఇప్పుడు పక్వానికి వచ్చాడు. అంటే హీరోగా రూపాంతరం చెందేందుకు కావాల్సిన ఫిజిక్ ని ట్రైనింగ్ ని తీసుకుని డెబ్యూ చేస్తున్నాడు. హీరోగా ఓ మూవీ ఇప్పటికే షూటింగ్ లో ఉండగా వచ్చే నెల 5న విడుదల కానున్న సమంతా ఓ బేబీలో లక్ష్మి గారికి మనవడిగా కనిపించబోతున్నాడు

సో హీరో కన్నా ముందే కీలకమైన పాత్ర ద్వారా తేజ ఎంట్రీ ఇస్తున్నాడు. రెండూ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నవి కావడం గమనార్హం. ఇదే సంస్థలో తేజ చిన్నప్పుడు వెంకటేష్ కలిసుందాం రాలో చేసిన అల్లరి మాములుది కాదు. ఇన్నేళ్ల తర్వాత అదే సంస్థలో ఇలా తెరంగేట్రం చేయడం విశేషమే.

చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిసులుగా విపరీతమైన పేరు తెచ్చుకున్న వాళ్ళు పెద్దయ్యాక రాణించిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆలీ-రాశి ఇలా వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. మరి తేజ తనదైన మార్కుతో హీరోగా ఆర్టిస్ట్ గా ఎలా రుజువు చేసుకుంటాడో సాంపుల్ గా ఓ బేబీలో చూడొచ్చు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఓ బేబీ మీద టీజర్ వచ్చాక మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: