ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ కి హీరోగా రిఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా అద్భుత విజయంతో మరొక్కసారి తన పవర్, కలెక్షన్ల స్టామినా ఏ మాత్రం తగ్గలేదని మరొక్కసారి రుజువు చేసుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తరువాత తన తదుపరి సినిమాపై కొంత ఆలోచించిన మెగాస్టార్, చివరికి తొలిసారి తన కెరీర్ లో ఒక దేశభక్తి ప్రధాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించారు. 

అదే సైరా నరసింహా రెడ్డి సినిమా, స్వాతంత్రోద్యమానికి ముందు అప్పటి బ్రిటిష్ వారిని ఎదిరించి ధీటుగా నిలబడిన తెలుగు యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో, మెగాస్టార్ ప్రక్కన నయనతార జోడి కడుతుండగా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే దాదాపుగా 70 శాతానికి పైగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక మొదట్లో ఈ సినిమాని స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయాలని భావించి, షూటింగ్ లో కొంత జాప్యం కారణంగా ఆపై సినిమాని దసరాకు విడుదల చేయాలని నిర్ణయించారు. 

అయితే, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మరొక్కసారి వాయిదా పడిందని, సినిమాలో కొంత గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉందని, అది పూర్తి అవడానికి మరింత సమయం పడుతుందని, కాబట్టి సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట ఆ చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం ఈ వార్త అటు టాలీవుడ్ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: