ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నా పేరు సూర్య డిజాస్టర్ తర్వాత చాలా టైమ్ తీసుకుని మధ్యలో చాలా మంది డైరెక్టర్లు కథ చెప్పినా గానీ వాటిని ఓకే చేయకుండా బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకోవడం జరిగింది.


అయితే ఈ సినిమాలో బన్నీ పక్కన సెకండ్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ వెతుకుతుండగా...బన్నీ కోసం నటించడానికి పైగా త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయడానికి చిత్రలహరి లో నటించిన నివేధా పేతురాజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో..డైరెక్టర్ త్రివిక్రమ్ నివేధా పేతురాజ్ కీ అవకాశం ఇవ్వటం జరిగింది. మొత్తం మీద బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సెకండ్ హీరోయిన్ గా నివేధా పేతురాజ్ కీ  చాన్స్ రావడంతో ఇండస్ట్రీలో కీ నివేధా మంచి ఛాన్స్ కొట్టేసింది అన్ని కామెంట్లు చేస్తున్నారు.


ఈ క్యారెక్టర్ కోసం చాలా పేర్లు వినిపించాయి. కానీ ఆఖరికి నివేథా పేతురాజ్ పేరు ఫైనల్ అయింది. ఫైనల్ కావడమే కాదు, ఇటీవల షూటింగ్ సెట్ కూడా కూడా వచ్చింది. నివేథా పేతురాజ్ తొలిసారిగా చిత్రలహరి సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటించింది. ఇది రెండో సినిమా. ఈ సినిమాతో ఎలాగైనా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.



మరింత సమాచారం తెలుసుకోండి: