సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తూ, నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా ఓ బేబీ. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని ఒక పాటను ఇటీవల విడుదల చేసిన చిత్ర యూనిట్, నిన్న మీడియా ముఖంగా సినిమా గురించిన విశేషాలు తెల్పడం జరిగింది. ఇక ఈ వేడుకలో దర్శకురాలు నందిని రెడ్డి, హీరోయిన్ సమంత, నిర్మాత సురేష్ బాబు, నటుడు తేజ పాల్గొన్నారు. ఇక ఈ సినిమా విషయమై ముందుగా మాట్లాడిన సమంత, తనకు కెరీర్ పరంగా ఎప్పటినుండో తీరని రెండు కోరికలు ఈ సినిమాతో తీరాయని అన్నారు. 

ముందుగా తనకు సురేష్ ప్రొడక్షన్స్ లో ఎప్పటినుండో సినిమా చేయాలనీ అనుకున్నానని, అది ఈ సినిమాతో తీరిందని, ఇకపోతే మరొకటి ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో నటించాలి అనేది కూడా తన కోరిక అని, అది కూడా ఈ సినిమాతో తీరిందని అన్నారు. ఇక ఈ సినిమా నిర్మాత సురేష్ బాబు గారు తనను కూడా బేబీ లానే చూసుకున్నారని అన్నారు. తాను ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండ మంచి హిట్ అయి నందిని రెడ్డిగారి కెరీర్ కి పెద్ద బ్రేక్ ని ఇస్తుందని అన్నారు. ఇక నందిని రెడ్డి మాట్లాడుతూ, కొరియాలో మంచి హిట్ అయిన ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు మలిచాడం జరిగిందని, 

ఇక సినిమా ఇంత బాగా రావడానికి సమంత ఎంతో బాగా ఒదిగి నటించడం ముఖ్య కారణమని, అలానే సీనియర్ నటి లక్ష్మి గారు అద్భుతంగా నటించారని, తప్పకుండ ఈ సినిమా హిట్ అవుతుందని తాను నమ్ముతున్నట్లు ఆమె అన్నారు. సురేష్ బాబు మాట్లాడుతూ తమ సంస్థ కీర్తిని పెంచేలా ఈ సినిమా ఉంటుందని, నందిని మరియు సమంత సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారని, తప్పకుండ రేపు విడుదల తరువాత సినిమా పెద్ద హిట్ అయి నందిని గారికి మంచి కం బ్యాక్ ఫిలిం అవుతుందని నమ్మకం ఉందన్నారు. నిజానికి ఇటీవల తాను చేసిన సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సమంత గోల్డెన్ హ్యాండ్, తప్పకుండా ఈ సినిమాకు కూడా కలిసివస్తుందనేది సినీ విశ్లేషకులు చెప్తున్నా మాట. మరి రేపు విడుదల తరువాత ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుని నందిని రెడ్డి కెరీర్ కి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వేచిచూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: