కొన్ని సినిమాలు ప్రొడక్షన్ లో ఉండగానే అటు సినీ వర్గాల్లో..ఇటు ప్రేక్షకుల్లో బాగా హైప్ క్రియోట్ అవుతుంది. అందుకు చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా హీరోకి దానికి ముందు బారీ హిట్ ఉండొచ్చు..లేదా దర్శక నిర్మాతలు సక్సస్‌ఫుల్ సినిమా తీసి ఉండొచ్చు. దానికి తోడు మా సినిమా కథ కథనాలు చాలా డిఫ్రెంట్ అని చేసే ప్రమోషన్స్ కూడా జనాల క్యూరియాసిటిని అమాంతం పెంచేస్తాయి. ఇక కొంతమంది దర్శక నిర్మాతలైతే శాటిలైట్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినా అమ్మరు. కానీ సినిమా రిలీజై అన్నీ తలకిందులై డిజాస్టరైతే మాత్రం ఇక ఆ పరిస్థితే వేరు. అలాంటి పరిస్థితే రీసెంట్‌గా రిలీజైన సెవెన్, హిప్పీ సినిమాలకి ఎదురైంది. భారీ ప్రమోషన్స్ తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సెవెన్, హిప్పీ సినిమాలు ఒక్క షోతేనే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్నాయి. 


కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోలేక పోయాయంటే ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 7 సినిమా టీం అయితే తమ సినిమా గురించి గొప్పలు పోవడమే కాదు.. మీడియాకి రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రమోషన్స్ ని హోరెత్తించారు. పోస్టర్స్, ట్రైలర్ తో తెగ హంగామా చేశారు. 7 సినిమా విడుదలై హిట్ అవుతుందని 7 టీం ఎంతగా నమ్మింది అంటే... రిలీజ్ కు ముందు సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకుండా బిల్డప్ ఇచ్చారు. లిప్ లాక్స్, రొమాంటిక్ సన్నివేశాలతోనే సినిమాలు ఆడేస్తాయనుకుంటే ఎంత పొరబాటు అనేది 7 సినిమా టాక్ చెబుతుంది. సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతే విడుదలకు ముందు రోజే 7 టీం ప్రీమియర్స్ తో హోరెత్తిస్తారు. ఇక ఈ సినిమాకి మొదటి షో మొదటి టాక్ కే బ్యాడ్ టాక్ వచ్చేసింది.


మరోపక్క ఆర్.ఎక్స్. 100 తో హీరో అయిన కార్తికేయ ఎంతో కాన్ఫిడెంట్ తో చేసిన హిప్పీ సినిమా కూడా 7 తో పాటే విడుదలైంది. టి.ఎన్ కృష్ణ యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన హిప్పీ సినిమాకి కూడా బ్యాడ్ టాక్ వచ్చింది. కార్తికేయ ఆర్.ఎక్స్. 100 కి పది రెట్ల హిట్ హిప్పీ సినిమాతో ఇస్తామని తెగ గొప్పలు పోయాడు. మా సినిమా హిట్ అంటూ తెగ ప్రమోట్ చేసిన హిప్పీ సినిమా చూసిన ప్రేక్షకుడికి విసుగు తెప్పించింది. కార్తికేయ సిక్స్ పాక్స్ కోసమే సినిమా తీసారా అనిపించేలా పాటలోను, ఫైట్ లోను కార్తికేయ చొక్కా విప్పి కండలు చూపించే ప్రోగ్రాం పెట్టుకున్నాడని టాక్. అసలు ఈ సినిమా యూత్ కోసమే తీసినట్టుగా అనిపించినా వాళ్ళలో ఒక రకం కూడా థియొటర్స్ కి వచ్చే పరిస్థితి నెక్స్ట్ షో నుండే కరువైంది. మరి విడుదలకు ముందు ప్రమోషన్స్ తో జోరు చూపించిన హిప్పీ మూవీ చూసిన వారు.. ఈ సినిమాకా ఇంత షో చేశారని కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: