ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న క్రేజీ సినిమాల్లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా నటించిన 'డియర్ కామ్రేడ్' ఒకటి.  యూత్ సెన్సేషన్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ నటించడం..  బ్లాక్ బస్టర్ 'గీత గోవిందం' జోడీ అయిన విజయ్ -రష్మిక జోడీ మరోసారి రిపీట్ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి ఎక్కువగానే ఉంది. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడమే కాదు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఇయర్ ఫస్టాఫ్ లో చెప్పుకోదగిన సినిమాలు ఎఫ్-2, చిత్రలహరి, మహర్షి మాత్రమే కావడంతో విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


అందుకనే తాజాగా 'డియర్ కామ్రేడ్' టీమ్ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.  ఈ సినిమాను జులై 26 న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటినుంచి ఈ సినిమా విడుదలకు సరిగ్గా యాభై రోజులు ఉంది. దీంతో డియర్ కామ్రేడ్ రిలీజ్ కు కౌంట్ డౌన్ అన్నట్టుగా '50 డేస్ టు గో' అంటూ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ లో ఇంటెన్స్ లుక్ లో ఉన్న విజయ్ పరిగెడుతూ ఉన్నాడు. విజయ్ వెనక మరికొందరు కూడా పరిగెడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రమోషన్ విజయ్ కి బాగా సూటవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళం.. కన్నడ.. మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ 'డియర్ కామ్రేడ్' చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఒకేసారి విజయ దేవరకొండ సినిమా నాలుగు భాషల్లో రిలీజవడం కూడా ఇదే మొదటిసారి. మరి ఈ సినిమా విజయ్ ని ఏ రేంజ్ కి తీసుకెళుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: