పదేళ్ళ సినిమా కెరీర్లో చాలా సినిమాల్లో నటించింది సమంత. కొన్ని సినిమాల్లో అందానికి ప్రాముఖ్యతనిచ్చే పాత్రల్లో నటించగా మరికొన్ని సినిమాల్లో అభినయానికి ప్రాముఖ్యతనిచ్చే పాత్రల్లో నటించింది. నాగచైతన్యతో పెళ్ళి తరువాత మాత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాల్లో మాత్రమే సమంత నటిస్తోంది.


యూ టర్న్, మజిలీ సినిమాలతో హిట్లు అందుకున్న సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమాలో నటించింది. కెరీర్లో కామెడీ పాత్రలు చేయకుండానే రిటైర్ అయిపోతానని అనుకున్నానని కానీ ఓ బేబీ సినిమాతో ఆ కొరిక తిరిందని చెప్పారు సమంత. ఓ బేబీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయని చెప్పారు సమంత.


ఓ బేబీ సినిమా కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాకు రీమేక్. అలా మొదలైంది, జబర్దస్త్ సినిమాలకు దర్శకత్వం వహించిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పై నిర్మించబడుతున్న ఈ సినిమా జులై 5 న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సమంత కు జోడీగా నాగ శౌర్య నటిస్తున్నాడు


మరింత సమాచారం తెలుసుకోండి: