సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలో మరొక హీరో నటించిన సందర్భాలు చాల ఉన్నాయి. ఇప్పుడు మహేష్ అనీల్ రావిపూడిల ‘సరిలేరు నీకెవ్వరు’ కూడ అలాంటి లిస్టులోని మూవీ మాత్రమే అంటూ కథనాలు వస్తున్నాయి. ‘పటాస్’ మూవీ సక్సస్ తరువాత కళ్యాణ్ రామ్ ప్రోత్సాహంతో అనీల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా దర్శకత్వం వహించేందుకు ప్రయత్నించి చెప్పిన కథ ‘సరిలేరు నీకెవ్వరు’ అని అంటున్నారు. 

‘రామారావుగారు’ అన్న టైటిల్ తో అల్లబడ్డ ఈ కథ బాలకృష్ణకు బాగా నచ్చినా తన 100వ సినిమాగా ఒక ల్యాండ్ మార్క్ మూవీ చేయాలని ఆశపడి అనీల్ రావిపూడిని పక్కకు పెట్టి క్రిష్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసినట్లు సమాచారం. ఆతరువాత ఆకథ విషయం బాలయ్య పెద్దగా పట్టించుకోకపోవడంతో అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ వైపు వెళ్ళిపోయాడు. 

అయితే ‘ఎఫ్ 2’ భారీ సక్సస్ తో అనూహ్యంగా ఈ యంగ్ డైరెక్టర్ కు మహేష్ తో సినిమా చేసే అవకాసం రావడంతో బాలకృష్ణ కోసం తయారు చేసిన ‘రామారావుగారు’ స్క్రిప్ట్ కు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి దానినే ‘సరిలేరు నీకెవ్వరు’ గా తీస్తున్నాడనీ ఇండస్ట్రీ వర్గాలు టాక్. బాలకృష్ణ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ లో కూడ విజయశాంతి అత్తగారి పాత్ర ఉందనీ ప్రచారం జరుగుతోంది. 

దీనితో అనీల్ రావిపూడి చాల తెలివిగా మహేష్ కోసం వేగంగా కథ వ్రాసానని చెపుతూ గతంలో బాలకృష్ణ కోసం వ్రాసిన కథనే మార్చి తీస్తున్నాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇది అంతా అనీల్ రావిపూడి ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారం అనీ అనీల్ మహేష్ కోసం ప్రత్యేకంగానే కథ వ్రాసాడు అంటూ అతడి సన్నిహితులు ఈ రూమర్స్ ను ఖండిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: