ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు ముహూర్తం షాట్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక షూటింగ్ లొకేషన్లు..ఫోటో లీకులు కామన్ అయ్యాయి.  ఆ మద్య కొన్ని సన్నివేశాలు సినిమా రిలీజ్ కి ముందే నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి.  బాహుబలి పార్ట్ 1 క్లయిమాక్స్ పోరట సన్నివేశం లీక్ కావడం పెను సంచలనాలు సృష్టించింది. అంతే కాదు కొన్ని సినిమాలు రిలీజ్ కాకముందే నెట్ లో ప్రత్యక్షం కావడం..రిలీజ్ అయిన రెండు మూడు గంటల్లోనే పూర్తి సినిమా వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. 


తాజాగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ కథ లీక్ అయిందని పోలీసులను ఆశ్రయించారు.  ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది.  అయితే ఈ సినిమా కథ లీకైంది.. ఈ మేరకు పూరీ కనెక్ట్స్ సంస్థ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

ఇస్మార్ట్ శంకర్ స్టోరీని బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ చేసాడని, డిలీట్ చెయ్యమని మూవీ టీమ్ అడిగితే భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నాడని, పూరి తరపున పూరి కనెక్ట్స్ మెంబర్ పోలీసులకు కంప్లైంట్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాకపోతే అంత పకడ్భందీగా ఉండే డేటా..స్క్రిప్ట్ ఎలా లీక్ అయ్యింది అనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: