బాలీవుడ్ లో దంగల్ సినిమా భారీ వసూళ్లు సాదించినది.  ఇప్పటి వరకు ఇండియాలో టాప్ వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తన కూతుర్లతో ఎలా ఆ లక్ష్యాన్ని సాధించాడు అన్నది సినిమా కథ.  ఈ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక సామాన్య కుటుంబంలోని తండ్రి ఆవేదనను, ఆశయాలను కూతర్లు ఎలా నెరవేర్చారు అన్నది కాన్సెప్ట్.


దీనిని తెరపై ఆవిష్కరించారు నితీష్ తివారి.  ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది.  చైనాలో ఏకంగా ఈ మూవీ 1983 కోట్లు వసూలు చేసింది.  చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దంగల్ నిలిచింది. ఈ సినిమా తరువాత సీక్రెట్ సూపర్ స్టార్ వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది.  


సౌత్ నుంచి బాహుబలి చైనాలో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు.  అయితే, ప్రభాస్, రానాలను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆ సినిమా ఉపయోగపడింది.  ఇప్పుడు శంకర్ 2పాయింట్ 0 సినిమాను జులై 12 వ తేదీన చైనారో 5600 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.  గ్రాఫిక్స్ మాయాజాలంతో, 3డిలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.  


అందుతున్న సమాచారం ప్రకారం 2పాయింట్ 0 కు చైనా పాజిటివ్ టాక్ వైబ్ క్రియేట్ అయ్యింది.  ఇప్పటి నుంచే లైకా సంస్థ అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తున్నది.  రిలీజ్ కు మరో నెల రోజుల వ్యవధి ఉండటంతో ఎలాగైనా దంగల్ టార్గెట్ ను రీచ్ కావాలని చూస్తోంది ఈ చిట్టి.  మరి చిట్టి కలలు సాకారం అవుతాయా చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: