పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవ్వడమే కాకుండా అతడి అన్న నాగబాబును కూడ ‘జబర్దస్త్’ కార్యక్రమానికి దూరంగా ఉండమని సలహా ఇచ్చినా ఆసలహాలను నాగబాబు పట్టించుకోలేదు అంటూ ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. వాస్తవానికి ఈ న్యూస్ లోని యదార్ధత పై చాలసందేహాలు ఉన్నా ఈవార్త నిజమా ? లేదంటే ఎవరో ఒకరు కావాలని క్రియేట్ చేసిన గాసిప్ అనుకోవాలా అనే విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

హడావిడి చేస్తున్న ఈ వార్తల ప్రకారం మరో 10 సంవత్సరాలు లేదంటే 20 సంవత్సరాలు ప్రజల మధ్యే ఉంటూ ‘జనసేన’ కు జీవం పోయడానికి జయాపజయాలతో సంబందిం లేకుండా పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహాలకు పవన్ నాగబాబు సహాయం అడిగినట్లు టాక్. దీనికోసం ప్రస్తుతం నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న ‘జబర్దస్త్’ కార్యక్రమానికి శాస్వితంగా గుడ్ బై చెప్పి తనకు సహాయం చేస్తూ ‘జనసేన’ ను జనం మధ్యకు తీసుకు వెళ్ళడానికి నాగబాబు సహాయాన్ని పవన్ అడిగినట్లు తెలుస్తోంది. 

అయితే నాగబాబు తాను ‘జబర్దస్త్’ కార్యక్రమం చేస్తూనే ‘జనసేన’ కు తన సహాయ సహకారాలు అందిస్తానని అదేవిధంగా పవన్ ను కూడ పూర్తిగా సినిమాల నుండి దూరం కాకుండా కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా అయినా చేయమని నాగబాబు సలహా ఇచ్చినట్లు టాక్. అయితే నాగబాబు సలహా పవన్ కు పెద్దగా రుచించలేదు అని అంటున్నారు. 

దీనితో పవన్ కు ఇష్టం లేకున్నా ‘జబర్దస్త్’ కార్యక్రమానికి తిరిగి నాగబాబు యూటర్న్ తీసుకుని ప్రస్తుతం ఆ కార్యక్రమంలో తిరిగి బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మంగళగిరిలో పవన్ నిర్వహించిన ‘జనసేన’ సమీక్షా సమావేశాలకు నాగబాబు రావడంతో పవన్ కు ఇష్టం ఉన్నా లేకున్నా ‘జనసేన’ తో పాటు బుల్లి తెర పై నాగబాబు ద్విపాత్రాభినయం కొనసాగడం ఖాయం అన్న సంకేతాలు వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: