మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ మూవీ జూన్ 26 వ తేదీన షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. మే 31 వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.  దీన్ని పక్కా ఎంటర్టైనర్ జానర్లో తెరకెక్కించబోతున్నాడు అనిల్ రావిపూడి. 


పక్కా ఎంటర్టైనర్ అయినప్పటికీ ఇందులో ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందట.  మహేష్  కాశ్మీర్ నుంచి ట్రైన్ లో తిరిగి  వస్తున్న సమయంలో రష్మిక పరిచయం అవుతుంది.  అలా వారి జర్నీ పూర్తయ్యే సరికి ఇద్దరు ప్రేమలో పడతారు. తన ప్రేమను నిజం చేసుకోవడానికి మహేష్ పల్లెటూరికి వస్తాడు.  


సరిలేరు నీకెవ్వరూ కథ ఇదే అని ప్రచారం జరుగుతున్నది.  ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదుగాని, విజయశాంతిని తీసుకోవడంతో ఇది నిజమే అని అంటున్నారు.  ఏది ఏమైనా కథ ఇలా ఉంటె కాస్త బాగుంటుంది.  కథ చదువుతుంటే వెంకటేష్ సినిమాల్లో ప్రేమను నిజం చేసుకోవడానికి పల్లెటూరికి వచ్చినట్టు లేదు. 

అలానే బాలీవుడ్ సినిమాల్లో ఈ తరహా కథలు గతంలో వచ్చాయి.  షారుక్ ఖాన్ దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే ఈ తరహా కధే. అయితే ఇది పూర్తిగా పల్లెటూరికి సంబంధించిన కథ కావడంతో కాస్త వెరైటీగా ఉంటుంది.  పైగా అనిల్ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది కాబట్టి సినిమా బాగుందనే అనిపిస్తోంది.  చూద్దాం ఎలా ఉంటుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: