చాలా మంది హీరోయిన్స్ సక్సస్ లో ఉండగానే పెళ్ళి చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. కొంతమంది మాత్రం సక్సస్ ఫుల్ గా కెరీర్ కంటిన్యూ అయినంత వరకు పెళ్ళి మాటే ఎత్తరు. అదేంటని అడిగితే ఇప్పుడే తొందరేముంది. దానికింకా చాలా టైం ఉంది గా అని దాటేస్తారు. ముప్పై దాటిన హీరోయిన్స్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అయితే వాళ్ళందరికంటే చిన్న దాన్ని..నాకింకా నా వయసు ముప్పై కూడా దాటలేదు అంటోంది మిల్కీ బ్యూటి తమన్నా బాటియా. ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చి దాదాపు 14 ఏళ్ళు అవుతోంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో సీనియర్ కానీ తమన్నాది చిన్న వయసే. అంటే మరీ పెళ్ళి వయసు రాలేదని కాదనుకోండి.


 సౌత్ లో దాదాపు పెద్ద స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ నటించింది తమన్న. సౌత్ భాషల సినిమాలే కాదు.. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది.  కెరీర్ పరంగా చూసుకుంటే సీనియర్ అనిపిస్తుంది కానీ వయసు ఇంకా ముప్ఫై దాటలేదు. ఇప్పటికీ చేతిలో చాలా సినిమా ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ భామకు పెళ్ళి ఆలోచన లేదా? రాదా..? అన్న ఆలోచన ప్రేక్షకులతో పాటు చాలామందిలోను ఉంది. ఇదే విషయం గురించి తమన్న అందరికి దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చింది. ఆ సమాధానం మరి ఇంకా పెళ్ళి చేసుకొని హీరోయిన్స్‌కా లేక సక్సస్‌లో ఉండగానే పెళ్ళి చేసేసుకున్న హీరోయిన్స్‌కా తెలీదు.


 ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని.. పెళ్ళి చేసుకునేలోపు ఇంకా తను సాధించాలని అనుకునే గోల్స్ ఉన్నాయని చెప్పింది.  తనకు డ్రైవింగ్ నేర్చుకోవాలని.. ఈత నేర్చుకోవాలని ఉందని తెలిపింది. ఒక నటిగా ఇవి ఎప్పుడో నేర్చుకొని ఉండాలిగా.. ఇన్ని రోజులు డ్రైవింగ్.. ఈత నేర్చుకోకుండా ఎలా మ్యానేజ్ చేసిందో మరి. మరి ఇప్పటికైనా కాస్త వీలు చూసుకొని ఇవన్ని నేర్చుంటే బావుంటుంది. ఇక తమన్నా ప్రస్తుతం 'సైరా' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  బాలీవుడ్ 'క్వీన్' తెలుగు రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు తమిళంలో సుందర్ సి. దర్శకత్వంలో మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీ సినిమా 'ఖామోషి' జూన్ 14  న రిలీజ్ కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: