ఏదేమైనా యాంకర్ అనసూయది లక్కీ టైం. టీవీలో టాప్ యాంకర్‌గా ఉండగానే సినిమాలలో మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. ముఖ్యంగా మెగా ఫ్యామీలి హీరోస్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అనసూయకు మొదట అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను అనసూయ వదిలేసుకుంది. అనసూయ ఒక సారి మెగా ఛాన్స్ ను వదులుకున్నా ఆ తర్వాత వరుసగా ఛాన్స్‌లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనసూయ 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ తో కలిసి చేసిన రంగమ్మత్త పాత్రను జనాలు గుర్తుంచుకున్నారు. ఇప్పటికే అనసూయ కాస్త రంగమ్మత్త అయ్యింది. 


అనసూయను ప్రేక్షకులు ఎక్కడ చూసిన రంగమ్మత్తే అని పిలుస్తున్నారు. చరణ్ సినిమాలోనే కాకుండా వెంకటేష్-వరుణ్ తేజ్ సినిమా 'ఎఫ్ 2'లో, సాయి ధరమ్ తేజ్'విన్నర్' సినిమాలో కూడా అనసూయ రచ్చ చేసింది. ఇప్పుడు మరో మెగా సినిమాలో అనసూయకు ఛాన్స్ దక్కింది.  మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెల్సిందే. త్వరలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సైరా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా కొరటాల శివ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి పెట్టాడు. 


రీసెంట్ గా  చిరు 152 సినిమా కోసం నటీనటులను ఎంపిక జరిగిందట. అయితే అనసూయకు కూడా కొరటాల నుండి పిలుపు వచ్చిందని.. చిరంజీవి మరియు చరణ్ సూచన మేరకు ఒక కీలక పాత్ర కోసం అనసూయను కొరటాల శివ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ ఈ సారి ఏ రేంజ్ లో మెగా ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: