హీరోలుగా కెరీర్ స్టార్ట్ చేసి నాలుగేళ్ళవుతోంది. పేరున్న దర్శకులతోనే పని చేస్తున్నారు. కానీ వాళ్ళు కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్లైతే సాధించలేకపోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉన్నప్పటికీ హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నారు. తల్లిదండ్రుల నుండి ఎంత ప్రోత్సాహం ఉన్నా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టలేక చతికలపడుతున్నారు యువ హీరోలు.

 

ఈ లిస్ట్లో ముగ్గురు హీరోలు ఉన్నారు. అక్కినేని అఖిల్ , బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్, అఖిల్ 'అఖిల్ ' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసాడు. ఆ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ తరువాత అఖిల్ నటించిన హలో మిస్టర్ మజ్నూ సినిమాలు కూడా ఫ్లాపులు కావడంతో అఖిల్ కెరీర్ ఇబ్బందుల్లో ఉంది.


గౌరవం, కొత్త జంట సినిమాలు ఫ్లాప్ కాగా శ్రీరస్తు శుభమస్తు సినిమా పరవాలేదనిపించింది. ఆ తరువాత వచ్చిన ఒక్క క్షణం, ఎబిసిడి కూడా ఫ్లాపులుగా మిగిలాయి. ఈ లిస్ట్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. స్టార్ డైరెక్టర్లు , స్టార్ హీరోయిన్లు పని చేస్తున్నా భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నా బెల్లంకొండ శ్రీనివాస్ కు హిట్టు కూడా దక్కట్లేదు. ఈ ముగ్గురు హీరోలు బ్లాక్ బస్టర్ ఎప్పటికీ అందుకుంటారో ఆ బ్లాక్ బస్టర్ హిట్టుకు ఎంతకాలం పడుతుందో చూడాలి



మరింత సమాచారం తెలుసుకోండి: