తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తాము మరణించిన తరువాత కూడ శాసిస్తున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు ఎస్వీ రంగారావు అయితే మరొక వ్యక్తి మహానటి సావిత్రి. వాస్తవానికి వీరిద్దరికీ ఎటువంటి పద్మశ్రీ పురస్కారాలు ప్రభుత్వాల నుండి రాకపోయినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో వీరిద్దరూ చిరంజీవులుగా కొనసాగుతూనే ఉన్నారు. 

ఈ నేపధ్యంలో ఎస్వీ రంగారావు జీవితం పై రచయిత సంజయ్ కిషోర్ వ్రాసిన పుస్తకాన్ని మెగా స్టార్ చిరంజీవి ఆవిష్కరిస్తూ ఆ ఫంక్షన్ లో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఎస్వీ రంగారావు నటన అంటే తనకు ఎంతో ఇష్టం అని చెపుతూ వాస్తవానికి ఎస్వీ ఆర్ గొప్పతనం గురించి తనకు తన తండ్రి వల్ల తెలిసిందనీ తన తన తండ్రికి నటన పట్ల ఎంతో ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్ధిక పరిస్థుతుల వల్ల సినిమాలలో నటుడుగా రాణించలేకపోయిన విషయాన్ని చిరంజీవి వివరించాడు. 

అయితే తన తండ్రి ఎస్వీ ఆర్ నటించిన ‘జగత్ కిలాడీ’ ‘జగత్ జంత్రీలు’ సినిమాలలో చిన్న వేషం వేసే అదృష్టం పొందారని కానీ తనకు ఎస్వీ ఆర్ పక్కన జీవించే రోజులలో ఆయనను కలిసే అవకాసం లేక కనీసం ఆయనతో ఒక ఫోటో కూడ తీయించుకోలేకపోయాననీ చెపుతూ తన నటనను పరోక్షంగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎస్వీ ఆర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు చరణ్ నటనకు స్పూర్తిని పరోక్షంగా ఎస్వీ ఆర్ ఇచ్చిన విషయాన్ని తెలియచేస్తూ చిరంజీవి ఒక ఆసక్తికర విషయం తెలియచేసాడు.

చరణ్ తనతో సినిమాలలోకి హీరోగా రావాలని ఉంది అనీ తన కోరిక చెప్పినప్పుడు ముందుగా తాను చరణ్ కు ఎస్వీ ఆర్ నటించిన పాత సినిమాలు అన్నీ చూపించి నటన ఇలా సహజంగా ఉండాలి అన్న విషయాన్ని చిరంజీవి తెలియచేసాడు. ఇదే సందర్భంలో ఈ ఫంక్షన్ లో ఎస్వీ ఆర్ జీవితానికి సంబంధించిన పుస్తకం మొదటి కాపీని లక్షా వేయి నూట పదహార్లకు చిరంజీవి ప్రోత్సాహంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త హరినాథ్ బాబు కొనగోలు చేయడం ఈ ఫంక్షన్ కు హైలెట్..



మరింత సమాచారం తెలుసుకోండి: