ఏది పట్టుకున్నా దిల్ రాజుకు కలిసి వస్తోంది.  చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి.  డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ బాగుంది.  దీంతో సినిమా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా బ్రహ్మాండంగా ఉంది.  ప్రస్తుతం దిల్ రాజు మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నాడు.  


మాములుగా ఒక ప్రొడ్యూసర్ మరో ప్రొడ్యూసర్ కి సహాయం చేయడం చాల తక్కువ. కానీ దిల్ రాజు మాత్రం ఓ ప్రొడ్యూసర్ విషయంలో ఉదారంగా కొంత సహాయం చేసేందుకు సిద్ధం అయ్యాడు. సహాయం అంటే అదేదో డబ్బు అనుకునేరు.  కాదు హీరో కాల్షీట్స్.  


బండ్ల గణేష్ తెలుసుకదా. ఈయన పవన్ తో గబ్బర్ సింగ్ చేశాడు.  అలాగే ఎన్టీఆర్ తో టెంపర్ చేశాడు.  టెంపర్ తరువాత గణేష్ మరో సినిమా చేయలేదు.  చాలా కాలం అయ్యింది సినిమా తీసి.  ఇప్పుడు మరలా లైన్లోకి వచ్చాడు.  సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. 


అయితే నాని  కోసం ప్రయత్నించినా.. నాని డేట్స్ ఇవ్వడం లేదు.  దీంతో దిల్ రాజుకు తన గోడును చెప్పుకొని సహాయం చేయడంని కోరాడట.  నానితో మాట్లాడైన దిల్ రాజు తన హామీగా డేట్స్ ఇవ్వాలని కోరాడు.  మంచి కథ ఉంటె డేట్స్ ఇస్తానని చెప్పినట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: