సెన్సషల్ టాలీవుడ్ మూవీ అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ వస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముద్దు సీన్ లకు తక్కువేమి లేదు. కియారా అందాలను ముద్దు సీన్ లలో చూస్తే అభిమానులకు పిచ్చెక్కిపోద్ది. కబీర్ సింగ్' చిత్రంలోని ముద్దు సీన్స్ ముచ్చటను హీరోయిన్ కియారా అద్వానీ మాట్లాడుతూ చాలా తేలికగా తేల్చి పారేసింది. 


సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వీడియోల్లోనే ఘాటు ముద్దు సీన్స్ ఉన్నాయి. అలాంటిది ముద్దు సీన్స్ ను చాలా నార్మల్ గా చేశామంటూ కియారా అద్వానీ చెప్పుకొచ్చింది. ఇతర సీన్స్ మాదిరిగానే ఆ సీన్స్ ను కూడా చిత్రీకరించాం. కథలో.. సీన్ లో భాగంగా ఉంటాయి కనుక వాటికి ఎక్కువ కష్టపడకుండా చేశామంటూ కియారా చెప్పుకొచ్చింది.


షూటింగ్ సమయంలో లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు తప్ప అంతకు ముందు ఆ తర్వాత వాటి గురించిన ఆలోచనే లేదని ఆ సీన్స్ చాలా సింపుల్ గా షూట్ అవ్వడం వల్లే వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం రాలేదంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి సినిమాలో లెక్కకు మించి ముద్దు సీన్స్ ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది లేకుండానే పెట్టేశానంటోంది కియారా అద్వానీ. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఈమె వినయ విధేయ రామ దెబ్బ కొట్టడంతో మళ్లీ కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: