రజినీకాంత్ సౌత్ సూపర్ స్టార్ అందులో  లేదు.  సినిమా రంగంలోకి వచ్చేందుకు చాలా కష్టపడ్డాడు. సినిమాల్లో వచ్చిన తరువాత తన స్టైల్ తో మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు.  వరసగా సినిమాలు చేస్తూ నటనతో  అదరగొట్టి తమిళ ప్రజల హృదయాలను చొరగొన్నాడు.  


ఇలాంటి నటుడి గురించి చాలా కాలంగా తమిళ ప్రజలు ఉద్యమం చేస్తున్నారు.  రజినీకాంత్ గురించి ఉద్యమం చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారా.. అక్కడికే వస్తున్నా.. రజినీకాంత్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చాలా రోజులుగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.  


ఇన్నాళ్ల వాళ్ళ శ్రమ ఫలించింది.  ఐదో తరగతి పాఠ్యపుస్తకాల్లో రజినీకాంత్ గురించిన స్టోరీని అక్కడి ప్రభుత్వం ముద్రించింది.  చార్లీ చాప్లిన్, స్టీవ్ జాబ్స్ వంటి ప్రముఖుల పక్కన రజినీకాంత్ జీవితం గురించి ముద్రించింది.  ఇది చూసిన అభిమానులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు.  


రజినీకాంత్ గురించి తెలియని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.  రజినీకాంత్ మొదట కార్పెంటర్ గా పనిచేశారట.  ఆ తరువాత అయన బస్ కండెక్టర్ గా పనిచేశారు.  ఆ తరువాత కొందరి ప్రోద్బలంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ స్థానాన్ని సుస్థితం చేసుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: