2019 వ సంవత్సరంలో మొదటి ఆరు నెలలు ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు.  పెద్ద హీరోల సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి.  అందులో చాలా వరకు హిట్ అయ్యాయి.  2019 జూన్ నుంచి ఈ సంవత్సరం ఎండ్ వరకు భారీ బడ్జెట్ సినిమాలు రెండే  రిలీజ్ అవుతున్నాయి. 


అందులో ఒకటి ప్రభాస్ సాహో.  ఈ మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం.  


ఈ సినిమా తరువాత అక్టోబర్ 2 వ తేదీన మెగాస్టార్ సైరా సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీ పాన్ ఇండియన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.  సినిమా కోసం రామ్ చరణ్ 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు.  చారిత్రాత్మక సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  


దసరాకు వస్తుండటంతో.. మరో సినిమా ఆ సమయంలో రిలీజ్ కావడం లేదు.  ఇదిలా ఉంటె జులై 12 న సమంత ఓ బేబీ, ఆగష్టు 9 వ తేదీన మన్మధుడు 2, సెప్టెంబర్ లో వెంకిమామ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  సో, ఈ సినిమాలు వాటికి అడ్డం కాదు కాబట్టి ఈ సినిమాలు బాగున్నాయి అంటే వసూళ్ల వర్షం కురిసినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: