గత కొన్ని సినిమాలుగా  బాక్సాఫీస్ వద్ద  గోపిచంద్ కి, అసలు  ఏ మాత్రం కలిసిరావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా,  హిట్ మాత్రం ఇంకా అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.  ప్రస్తుతం  వరుస ప్లాప్ లతో  తనకున్న 'మినిమమ్ గ్యారెంటీ హీరో' అనే ట్యాగు లైన్ ను కూడా  సమర్పించుకున్నాడు ఈ యాక్షన్ హీరో.  దాంతో సహజంగానే  గోపీచంద్ మార్కెట్ బాగా డల్ అయిపోయింది.  కానీ ఈ విషయాలు  ఏం పట్టించుకోని నిర్మాత అనిల్ సుంకర మాత్రం  గోపీచంద్ పై లెక్కలకు మించి మరీ  కోట్లు ఖర్చు పెడుతున్నాడు.  


తమిళ్ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో  గోపీచంద్  చేస్తున్న  'చాణక్య' చిత్రానికి అనిల్ సుంకర భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెంచుకుంటూ పోతున్నారట.  పైగా రీషూట్స్ కూడా ఎక్కువుగా చేయిస్తున్నాడట.  అందుకే ఎప్పుడో మొదలైన షూటింగ్ ఇంకా 55 శాతం పార్ట్ ను మాత్రమే  చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుందని.. ఇలా అయితే ఓవర్ బడ్జెట్ కారణంగా..   చివరికి ఈ  సినిమా కూడా గోపీచంద్ కి  ప్లాప్ గానే మిగిలుతుందని, సినిమా యూనిట్ పెదవి విరుస్తున్నారు. మొదట  40 కోట్లకి  అనుకున్న  బడ్జెట్  కాస్త, ఇప్పుడు  55 కోట్లు దాటేలా ఉంది.  


 
ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో లాంగ్ షెడ్యూల్స్ షూట్  చెయ్యడం.. పైగా  సినిమాలో  బడ్జెట్ తో కూడకున్న  యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా  ఉండటం,  కీలకమైన  సన్నివేశాలను మళ్లీ  రీషూట్  చేయడం.. వంటి కారణాల వల్ల  ఇప్పటివరకూ  భారీగానే ఖర్చు అయింది.  దాంతో కనీసం 55కోట్ల కన్నా ఈ సినిమా పూర్తవుతుందో లేదో అని డౌట్ లోనే ఉంది యూనిట్.  అయినా,   గోపీచంద్ పైనా  55 కోట్లు వర్కౌట్ అవుతాయా..  నిజానికి గోపీచంద్ సినిమాకి  ఇంత పెద్ద మొత్తం రికవరీ కావాలంటే,  ఆ సినిమా  బ్లాక్ బ్లాస్టర్ హిట్  అవాల్సిందే.  ఒకవేళ బ్లాక్ బ్లాస్టర్ అయినప్పటికీ.. ఇంతవరకు గోపీచంద్ సినిమా  55 కోట్లు కలెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ హిస్టరీలోనే  లేదయ్యే. ఏంటో.. పాపం.. అనిల్ సుంకర !



మరింత సమాచారం తెలుసుకోండి: