మహేష్ 26 వ మూవీ కోసం అన్ని సిద్ధం అయ్యాయి.  31  తేదీన లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా జూన్ చివరి నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నది.  ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ త్వరలోనే ఇండియా వస్తాడు.  వచ్చిన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. 


ఇందులో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే జిమ్ లో కసరత్తులు ప్రారంభించింది.  ఈ రోల్ బ్యాక్ టు బ్యాక్ అనే విధంగా ఉండబోతుంది.  తనదైన మార్క్ తో రోల్ ఉంటుంది అంటున్నారు.  అంటే మహేష్ ఆర్మీ ఆఫర్ గా నటిస్తుంటే.. అక్కడ మహేష్ కు విజయశాంతి ఆఫీసర్ ఉంటారేమో.  


అక్కడి నుంచి విజయశాంతి పల్లెటూరికి వచ్చిన తరువాత.. మహేష్ కు రష్మిక పరిచయం కావడం.. అక్కడి నుంచి తల్లిని పరిచయం చేయడం రష్మిక ప్రేమ కోసం విజయశాంతిని ప్రసన్నం చేసుకోవడం వంటి వాటితో కూడిన సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది.  


ఇలాంటి ఫ్యామిలీ డ్రామాతో వచ్చే సినిమాలు గతంలో చాలా సినిమాలు హిట్ అయ్యాయి.  ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అనుకోవచ్చు.  మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: