నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ ఏకైక వారసుడు మోక్షజ్ఞ వెండితెర డెబ్యూ మూవీ విష‌యంలో రెండేళ్లుగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. మోక్షు డెబ్యూ మూవీ వ‌చ్చేస్తోంది అదిగో... ఇదిగో అంటూ వార్త‌లు రావ‌డం మిన‌హా సినిమా మాత్రం ప‌ట్టాలెక్కే దాఖ‌లాలు క‌న‌ప‌డ‌డం లేదు. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి మోక్షు డెబ్యూ మూవీ తీస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. మోక్షుకు సాయి అడ్వాన్స్ కూడా ఇచ్చేశార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.


ముందుగా బాల‌య్య వందో సినిమా శాత‌క‌ర్ణిలో మోక్షు పులోమావి పాత్ర చేస్తున్న‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాత కూడా బాల‌య్య మూడు, నాలుగు సినిమాలు చేసినా మోక్షు సినిమా మాత్రం ప‌ట్టాలెక్క‌లేదు. మోక్షు డెబ్యూ మూవీ కోసం బాల‌య్య చాలా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ని.. వార‌సుడికిని అమెరికాలో డ్యాన్స్‌, ఫైట్స్‌లో శిక్ష‌ణ ఇప్పిస్తున్న వార్త‌లు యేడాది క్రితం వ‌చ్చాయి.


ఇక బాల‌య్య ఆరు నెల‌లుగా ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళ్లిపోయాడు. పార్టీ ఓడిపోయినా ఆయ‌న మాత్రం హిందూపురం నుంచి వ‌రుస‌గా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు బాల‌య్య వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాల‌య్య చాలా గ్రాండ్‌గా మోక్ష‌జ్ఞ‌ను లాంచ్ చేయాల‌ని చూస్తున్నా మోక్షు మాత్రం బాల‌య్య‌ను బాగా టెన్ష‌న్ పెట్టేస్తున్నాడ‌ట‌. టాలీవుడ్‌లో న‌లుగురు టాప్ హీరోల్లో చిరు త‌న‌యుడు చెర్రీ ఇప్ప‌టికే తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. నాగార్జున ఇద్ద‌రు కుమారులు హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. వీరిద్ద‌రి కెరీర్ అంతంత‌మాత్రంగానే ఉంద‌నుకోండి అది వేరే సంగ‌తి. 


వెంక‌టేష్ కొడుకు చిన్న వ‌య‌స్సు కావ‌డంతో కాస్త టైం ప‌డుతుంది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి బాల‌య్య వార‌సుడి మీదే ఉంది. మోక్షు కోసం నాలుగైదు క‌థ‌లు వినిపించినా మ‌నోడికి వాటిల్లో ఏ ఒక్క‌టి న‌చ్చ‌లేద‌ని... వాటికి నిర్మొహ‌మాటంగా నో చెప్పాడ‌ని ఇండ‌స్ట్రీలోని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. దీంతో బాల‌య్య కూడా వార‌సుడికి ఏ క‌థ న‌చ్చుతుందో ? ఆ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో ? అని కాస్త టెన్ష‌న్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: