టాలీవుడ్లో క‌థ‌లు చెప్పి మెప్పించి.. ఒప్పించ‌డంలో సంక్లిష్ట‌మైన వాళ్లు ఎవ‌రంటే ద‌గ్గుపాటి ఫ్యామిలీయే. వీళ్ల‌లోనూ నిర్మాత సురేష్‌బాబు ఓ ప‌ట్టాన క‌థ‌తో క‌న్వీన్స్ కాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో ఉంది. ఆయ‌న‌కు క‌థ చాలా బాగా న‌చ్చాలి. క‌థ‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చెపుతాడు... అవ‌న్నీ క‌రెక్టుగా సెట్ అయితేనే ఆయ‌న‌తో సినిమా ఉంటుంది. అంతెందుకు బాహుబ‌లికి ముందు రానా మూడు ప్లాపులు మూట‌క‌ట్టుకున్నాడు... ఆ మూడు క‌థ‌లు సురేష్‌బాబు రిజెక్ట్ చేసిన‌వే. 


క‌థ ఎంపిక‌లో ప్లానింగ్ అంటే సురేష్‌బాబుదే.. ఈ విష‌యంలో ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా మెచ్చుకోవాలి. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు అంటే వెంకీ సంక్రాంతికి ఎఫ్ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు వెంకటేష్ చేతిలో ఏకంగా 5 సినిమాలున్నాయి. ఇవ‌న్నీ చెప్పుకోవ‌డానికి మాత్ర‌మే వీటిల్లో సురేష్‌బాబును దాటుకుని ఎన్ని సెట్స్‌మీద‌కు వెళ‌తాయా ? అన్న‌దే ఇప్పుడు సందేహం.


ప్ర‌స్తుతం వెంకీ మామ వ‌స్తోంది. ఈ సినిమా నేను లోక‌ల్ డైరెక్ట‌ర్‌ తర్వాత త్రినాథరావు, బెజవాడ ప్రసన్నకుమార్ , తరుణ్ భాస్కర్,  అనీల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు వెంకీ ఖాతాలో ఉండనే ఉన్నారు. వీరిలో అనిల్ రావిపూడి - వెంకీ మ‌ధ్య డిస్క‌ర్ష‌న్స్ న‌డిచాయి. త్రివిక్రమ్-వెంకీ సినిమాను కూడా అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఈ రెండు సినిమాలపై క్లారిటీలేదు.


త‌రుణ్ భాస్క‌ర్ స్క్రిఫ్ట్ సూప‌ర్ అంటూ సురేష్‌బాబు ప్ర‌క‌ట‌న చేశాడు. ఇది కూడా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో ?  తెలియ‌దు. ఈ డైరెక్ట‌ర్లు చెపుతోన్న క‌థ‌ల‌ను సురేష్‌బాబు ఒక ప‌ట్టాన ఓకే చేయ‌క‌పోవ‌డంతోనే ఇవేవి ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్కే ఛాన్సులు లేవ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. సురేష్‌బాబు క‌థ‌ల‌ను ఇంకా బాగా చెక్కాల‌ని సూచించ‌డంతో వాళ్లు ఈ టార్చ‌ర్‌ను త‌ట్టులేక‌పోతున్నామ‌ని స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: