ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ కంప్లీట్ కావొచ్చింది.  ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఒక్క సాంగ్ మినహా మొత్తం పూర్తయింది.  ఇక ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.   తన కుటుంబాన్ని అంతం చేసిన డాన్‌ని చంపడానికి నకిలీ ఇంటర్‌పోల్‌ ఏజెంట్‌గా చేరి హీరో తాను అనుకున్నది సాధిస్తాడనేది దాని సారాంశం. ఈ కథ తెలిసిన తర్వాత పలువురు దీనిని ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. 


రెండు వందల కోట్లు పెడుతోన్న సినిమాకి ఇలాంటి కథ తీసుకుంటారా అంటూ చాలానే కామెంట్లు చేస్తున్నారు.   దీంట్లో యాక్షన్‌ సన్నివేశాలే కళ్లు చెదిరేలా వుంటాయి. వెండితెరపై చూస్తే కానీ సరిపడా థ్రిల్‌ రానంతగా వీటిని తెరకెక్కించినట్టు సమాచారం. 


సాహో సినిమా కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్టు సమాచారం.  ప్రీ రిలీజ్ బిజినెస్ 300 కోట్లకు పైగా జరిగింది.  శ్రద్ధ కపూర్ ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది.  బిజినెస్ పరంగా సినిమా అద్భుతంగా జరిగినా.. యాక్షన్ పైనే ఆధారపడితే ఆ స్థాయిలో విజయం సాధిస్తుందా అన్నది తెలియాలి.  


వందల కోట్లు వసూలు చేసిన 'ధూమ్‌' సిరీస్‌లో ఏమి కథ వుందని? ఈ తరహా యాక్షన్‌ చిత్రాలకి విజువల్‌ అప్పీల్‌, థ్రిల్స్‌ కీలకం. సాహో టీమ్‌ ఖర్చంతా దాని మీదే పెట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: