టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి సుమారు 13 సంవత్సరాల గ్యాప్ తరువాత మహేష్ తో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటిస్తోంది. ఈమూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే విజయశాంతి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కాబోతోంది అంటూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్నాయి. 

ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈవార్తల ప్రకారం విజయశాంతి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఒక కీలక పాత్రను చేయబోతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా విజయశాంతి కోసం రాజమౌళి దృష్టిలో పెట్టుకుని ఈపాత్రను డిజైన్ చేసి ఈపాత్ర విషయం విజయశాంతి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు టాక్. 

ఈమూవీలో చరణ్ జూనియర్లు పోషిస్తున్న పాత్రలు ‘కొమరం భీమ్’ ‘అల్లూరి సీతారామరాజు’ జీవితాల స్పూర్తితో ఉండే నేపధ్యంలో వీరిద్దరినీ స్వాతంత్ర ఉద్యమం వైపు చైతన్య పరిచే ఒక మహిళ పాత్రలో విజయశాంతి పాత్ర గిరిజన నేపధ్యంలో ఉంటుంది అని అంటున్నారు. వాస్తవానికి ఈపాత్రకు మొదట్లో నిత్యామీనన్ పేరును రాజమౌళి పరిశీలించినా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే విషయంలో విజయశాంతి తీరు వేరు కాబట్టి ఆపాత్ర నిడివితో పాటు వయస్సు కూడ పెంచి రాజమౌళి ఇలా ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు టాక్. 

అయితే ప్రస్తుతం విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చిన నేపధ్యంలో ఆమూవీ షూటింగ్ లో ఉండగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోసం ఎంతవరకు విజయశాంతి తన డేట్స్ ను సద్దుబాటు చేయగలుగుతుంది అన్న విషయమై ఫైనల్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభం అవుతుంది అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: