ప్రస్తుతం అటు టాలీవుడ్ లోను ఇటు బుల్లితెరపై తమ ఆకట్టుకునే అందం మరియు అభినయంతో దూసుకెళ్తున్న కొద్దిమంది యాంకర్లలో రష్మీ ఒకరు. ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే పటాస్ మరియు జబర్దస్త్ షోల ద్వారా వీక్షకుల నుండి మంచి పేరు సంపాదించిన రష్మీ, ఆతరువాత కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఇకపోతే ఆమె తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన అభిమానులతో ఎప్పటికపుడు తన అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. 

అయితే నిన్న ఒక ప్రముఖ జాతీయ పత్రికలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రవిక లేకుండా వెనుకవైపు వీపు భాగాన్ని చూపుతూ ఒక ఫోటోకి ఫోజిచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఈ పోస్టర్ పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తే ,మరి కొందరు మాత్రం, ఒకప్పుడు మహిళలు రవికలు లేకుండా కేవలం చీరతోనే తమ శరీరాన్ని కప్పుకునేవారు, ఆ రకంగా చూస్తే ప్రియాంక గారు పోస్ట్ చేసిన ఈ పోస్టర్ లో తప్పేమి లేదని ఆమెను సమర్ధించిన వారు ఉన్నారు. అలా రవిక లేని చీరకట్టు పూర్వకాలం నుండి ఉందని ఒక వెబ్ సైట్ పోస్ట్ చేసిన కథనాన్ని రష్మీ ట్యాగ్ చేయడం జరిగింది. 

అయితే ఆమె పోస్టర్ ని తప్పు పడుతూ ఒక నెటిజన్, ఇలాంటి వేషాల వల్లనే ఆడవారు అత్యాచారానికి గురికాబడుతున్నారు, కాబట్టి పొట్టి పొట్టి దుస్తులు వేసుకోవడం ఆడవారు తగ్గిస్తే, సమాజంలో జరిగే అత్యాచారాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది అంటూ రష్మీ పోస్ట్ కు సమాధానం ఇచ్చాడు. ఇక వెనువెంటనే ఆ నెటిజన్ పై ఫైర్ అయిన రష్మీ, నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో పుట్టడం నేరం అంటూ ఆగ్రహిస్తూ అతడికి రిప్లై ఇచ్చారు. అయితే దానిపై ప్రతిస్పందించిన ఆ నెటిజన్, మేడం నేను మిమ్మల్ని తప్పుపట్టడం లేదు, నిజమే చెప్తున్నా, ఇటువంటి అభ్యంతరకర దుస్తుల వల్ల కొన్ని చోట్ల నేరాలు జరుగుతున్నాయి, ఒకవేళ నేను పెట్టిన పోస్ట్ మిమ్మల్ని బాధించి ఉంటె నన్ను క్షమించండి అంటూ కోరాడు. కాగా రష్మీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: