బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరు సల్మాన్ ఖాన్.  ఇప్పటికీ స్టిల్ బ్యాచ్ లర్ గా ఉన్న సల్మాన్ ఖాన్..ఎంతో యంగ్ గా కనిపిస్తూ కుర్ర హీరోలకు పోటీగా ఉన్నారు.  అయితే సల్మాన్ ఖాన్ సినిమాలంటే రంజాన్ స్పెషల్ అనే చెప్పొచ్చు.  ఆయన నటించేప్రతి సినిమా రంజాన్ కానుకగా విడుదల చేస్తుంటారు.  కొంత కాలంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న ప్రతి సినిమా ఒకటీ రెండు తప్ప బాక్సాఫీస్ షేక్ చేశాయి. 


తాజాగా రంజాన్ పండుగ కానుకగా సల్మాన్ నటించిన ‘భారత్’ సినిమా రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా సల్మాన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.  అందుకు నిరూపణే రిలీజ్ అయిన రెండుమూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరడం. అయితే సల్మాన్ ఖాన్ కెరీర్ లో వరుసగా వందకోట్ల క్లబ్ లో చేరిన సినిమాలపై చర్చలు నడుస్తుంది.  సల్మాన్ అంటే ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్ అని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ అభిమానులు.  


తాజాగా సల్మాన్ నటించిన ‘భారత్’ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరడంతో ఆయన 14 సెంచరీలు చేశారని బాలీవుడ్ ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  గతంలో సల్మాన్ చేసిన దబాంగ్,ఏక్ తా టైగర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో,దబాంగ్ 2,టైగర్ జిందా హై, రెడీ,బాడీ గార్డ్,జయహో,భజరంగి భాయ్ జాన్,కిక్,ట్యూబ్ లైట్,సుల్తాన్ , రేస్ 3 ఈ వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. 

తాజాగా సల్మాన్ ఖాన్ ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమాకు   “ఇన్షాల్లా” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీలో సల్మాన్ సరసన అలియా నటించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: