టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రంగప్రవేశం ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కమెట్టు పైకి ఎదుగుతూ అయన సాధించిన పేరు ప్రఖ్యాతలు మరియు కీర్తి ప్రతిష్టలు గురించి వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అయితే అది ఆయనకు అంత సులువుగా దక్కలేదనే చెప్పాలి, ఎందుకంటే మొదటి నుండి ఎంతో క్రమశిక్షణ కలిగిన చిరంజీవి గారు, తన సినిమాలకు సంబందించిన ప్రతి ఒక్క విషయాన్నీ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసేవారట. అంతేకాక తన సినిమాల గురించి రిపోర్టులు ఎప్పటికపుడు తెలుసుకుంటూ అభిమానులకు అవి ఎంతవరకు చేరువయ్యాయి, ఆ సినిమాలపై వారి స్పందన ఏమిటి అనేది ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండేవారట. అయితే అది ఒకరకంగా అయన కెరీర్ కు మంచిదయిందని, ఎందుకంటే అభిమానులే దేవుళ్ళని భావించే చిరంజీవి వంటి కొందరు హీరోలు అది తెలుసుకుని వారి అభిరుచికి తగ్గట్లు అలానే, ఎప్పటికపుడు మారుతున్న సినిమాల ట్రెండ్ ని తెలుసుకుని సినిమాలు చేస్తే విజయం తప్పక వరిస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మెగాస్టార్ ప్రస్తుతం నటిస్తున్న సైరా మూవీ ఇప్పటికే పలు వాయిదాలు పడిన విషయం తెలిసిందే. నిజానికి జూన్ సమయంలో తీసుకువద్దాం అనుకున్న సినిమా ఆగష్టు కి వెళ్లడం, ఇక ఆ తరువాత డేట్ మారి దసరాకు షిఫ్ట్ అవడం జరిగింది. అయితే సైరా సినిమా దసరాకి కూడా వచ్చే అవకాశం లేదని, ఒకేసారి సంక్రాంతి కానుకగా 2020లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని కొద్దిరోజుల నుండి వార్తలు పుకారవుతున్నాయి. ఇక అటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని స్వయంగా మెగాస్టార్ రంగంలోకి దిగినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటినుండి సినిమాలో బ్యాలెన్స్ ఉన్న గ్రాఫిక్ వర్క్ ని త్వరితగతిన పూర్తి చేయాలనీ, అవకాశం ఆన్నంతవరకు దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతైన తన కుమారుడు రామ్ చరణ్ సహా టీమ్ మొత్తాన్ని అలర్ట్ చేశారట మెగాస్టార్. 

నిజానికి ఇటీవల మెగాస్టార్ ని కలిసిన కొందరు ఫ్యాన్స్, సినిమా విడుదల మరింత ఆలస్యం ఎందుకు అవుతుంది సర్, చాలా రోజుల క్రితం వచ్చిన ఖైదీ నెంబర్ 150 తరువాత ఇప్పటివరకు మీ నుండి సినిమా రాకపోవడం కొంత ఇబ్బందిగా ఉందని అన్నారట, అంతేకాక ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతున్న సైరా విషయమై రిలీజ్ డేట్ ని ఎక్కువసార్లు మారిస్తే అది సినిమా ఫలితం పై కూడా కొంత ప్రభావం చూపుతుందని మెగాస్టార్ కూడా భావించడంతో షూటింగ్ వేగం పుంజుకుందట. మరి మెగాస్టార్ రంగంలోకి దిగాక షూటింగ్ కి బ్రేకులుండవని, అనుకున్న సమయానికి సైరా ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక ఫ్యాన్స్ కి పండుగే అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: