పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం గాజువాకలలో ఎదురైన ఘోర పరాజయం పవన్ ను ఏవిధంగా నిరాశ పరిచింది అన్న విషయానికి సంబంధించి పవన్ చేసిన ఒక లేటెస్ట్ కామెంట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ‘జనసేన’ ఘోర పరాజయానికి గల కారణాలను విశ్లేషిస్తూ నిన్న జరిగిన సమీక్షసమావేశంలో పవన్ ఈ కామెంట్స్ చేసినట్లు టాక్.
ఈమధ్య జరిగిన ఎన్నికలలో చాల చోట్ల ఓటుకు 2 వేల రూపాయలు చొప్పున ఓటర్లు పుచ్చుకున్న సందర్భాల గురించి మాట్లాడుతూ రానున్న 5 సంవత్సరాలకు సంబంధించిన 1825 రోజులకు సంబంధించి ఓటరు పుచ్చుకున్న 2 వేల నోటును లెక్కలోకి తీసుకుని భాగిస్తే ఒక ఓటరు దగ్గర కొనుక్కున్న ఓటుకు రోజుకు కనీసం 2 రూపాయలు విలువ కూడ ఉండదనీ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఒక ఓటరు ఏ ఆధారం లేక యాచాకుడుగా మారితే అంతకన్నా ఎక్కువగా సంపాదించుకోవచ్చు అంటూ పవన్ ఓటర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ చెప్పిన అభిప్రాయాలు వాస్తవ దృష్టితో ఉన్నా పవన్ చెపుతున్న లెక్కల గణాంకాలు సాధారణ ఓటరు అవగాహన చేసుకునే స్థితిలో లేరు. దీనితో పవన్ నిన్న చేసిన కామెంట్స్ కేవలం మీడియాకు హాట్ టాపిక్ గా మారవచ్చు కానీ ఆ మాటలలోని అర్ధాలు సాధారణ ఓటరుకు ఇప్పట్లో అర్ధం అవ్వక పోవచ్చు. 

ఇది ఇలా ఉండగా పవన్ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు జనసైనికులు చాల తక్కువ సంఖ్యలో వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో రానున్న కాలంలో ‘జనసేన’ ను జనం మధ్య బతకాలి అంటే పవన్ తన అన్నమాట ప్రకారం జనంలోనే ఉండాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: