శ్రియ గ్లామర్ చెక్కుచెదరలేదు. ఆమె ఎక్కడా తగ్గడంలేదు కూడా. రెండు దశాబ్దాల వెందితెర జీవితం శ్రియది. కసిగా కొంటె చూపు చూస్తూ కిర్రాక్ పుట్టించే కొంటెకోణంగి. శ్రియ హాట్ బేబీగా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. టాప్ హీరోలందరి పక్కన ఫస్ట్ చాయిస్ గా ఉంటూ టాప్ రేపిన శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ గుర్తుండిపోయే పాత్రలే వేసింది.


ఇదిలా ఉండగా ఇపుడు శ్రియ సీనియర్ హీరోలు అయిన బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ పక్కన నటించి శభాష్ అనిపించుకుంది. పెళ్ళి కూడా అయిన ఈ అమ్మడు రొమాంటిక్ పాత్రలు సైతం వేసేందుకు రెడీ అంటున్నా ఆమె సీనియారిటీని ద్రుష్టిలో పెట్టుకుని కొంతమంది దర్శకులు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి అవకాశాలు ఇస్తున్నారు. అందులో భాగంగా టేస్ట్ ఉన్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి శ్రియతో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారట. ఆ మూవీలో శ్రియ పదేళ్ళ పాపకు తల్లిగా యాక్ట్ చేయాలట.



ఇంతకు ముందు శ్రియ గోపాల గోపాల మూవీలో ఆరేళ్ళ కొడుకు తల్లిగా నటించింది. అలాగే గౌతమి పుత్ర శాతకర్ణి మూవీలో కూడా తల్లి పాత్రలో కనిపించింది. కానీ ఇలా ఏకంగా పదేళ్ళ పాపకు తల్లి, అది కూడా లేడీ ఓరియెంటెడ్ రోల్ అంటే శ్రియ అమ్మగా ఎలా జీవిస్తుందో మరి. అయినా ఇప్పటికీ అందదాల‌ రాణిగా ఉన్న శ్రియ అంత వయసున్న పాపకు తల్లి అంటే  యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: