హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరు.  గ్లామర్ ఉన్నంత కాలమే బండి నడుస్తుంది.  ఆ గ్లామర్ తగ్గిపోయినప్పుడు ఆటోమాటిక్ గా అవకాశాలు తగ్గిపోతాయి.  అందుకే అలాంటి హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేస్తూ అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ ఉంటారు.  


ఇప్పుడు కాజల్ కు కూడా అదే పరిస్థితి.  కాజల్ హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్నాయి.  ఒకటి ఆరా వస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.  దీంతో ఈ అమ్మడు తమిళంలో సినిమాలు చేస్తోంది.  అలా తమిళంలో చేస్తూనే.. తెలుగులో ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధం అయ్యింది.  


గతంలో ఎన్టీఆర్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ లో మెప్పించింది.  ఆ సాంగ్ సూపర్ హిట్టైంది.  ఇప్పుడు మరలా ఐటెం సాంగ్ లో మెరవబోతున్నది.  అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరక్కుతున్న సినిమాలో కాజల్ డ్యాన్స్ చేయబోతున్నది.  


ఇంకా పేరు పెట్టని ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, నివేత పెతురాజ్ కీలక పాత్ర చేస్తోంది.  అక్కినేని హీరో సుశాంత్ ఓ రోల్ చేస్తున్నాడు.  వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, జనవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: