రాజకీయాల్లోకి రావాలనుకునే వ్యక్తికి ఫలానా ప్రత్యేకతలు ఉండాలనే నియమాలు లేవు. నిజానికి భారత పౌరుడైన ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాల్లోకి రావచ్చు, అయితే వాటికీ కొద్దిపాటి అర్హతలు మాత్రం ఉన్నాయనే చెప్పాలి. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సినీరంగానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. అయితే వారిలో కొందరు పెద్దగా సక్సెస్ కాకపోగా, మరికొందరు మాత్రం విజయదుందుభి మ్రోగించి ముందుకు సాగుతున్నవారున్నారు. 

ఇకపోతే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల వలె తమిళనాట రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఇక ఇటీవల కమల్ ప్రత్యేకంగా పార్టీ పెట్టిన దగ్గరినుండి ఆయా పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దాలు మరింతగా పెరిగాయి. ఇక అతి త్వరలో మరొక సూపర్ స్టార్ రజినికాంత్ కూడా పార్టీ నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మీద నేడు సత్యరాజ్, అదేనండి మన బాహుబలిలో నటించిన కట్టప్ప, తన మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. అయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడడంతో తాము క్రొత్తగా పార్టీలు నెలకొల్పి ప్రజలకు నీతి, నిజాయితీతో కూడిన పాలన అందించడానికి వస్తున్నాం అని కొందరు స్టార్లు చెప్తున్న గొప్పల వలన ఏమి ఉపయోగం ఉండదని, 

అలానే ఇక్కడ ఎప్పటినుండో పాతుకుపోయిన డీఎంకే పార్టీ వంటి మహావృక్షాలను పెకిలించడం వారితరం కాదని, కాబట్టి ఎవరి పని వారు చూసుకుని చేసుకుంటే మంచిదని వారిద్దరిని ఉద్దేశించి కొంత పరోక్ష వ్యాఖ్యలు చేసారు సత్యరాజ్. అయితే సత్యరాజ్ వ్యాఖ్యలను అక్కడి పార్టీల వారు కొందరు సమర్దిస్తుంటే, కమల్ మరియు రజిని ఫ్యాన్స్ మాత్రం ఆయనపై కోపాగ్నితో ఊగిపోతూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: