ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ ఒకపక్క సౌత్ లో మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ ఏర్పడిందని కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ఐటమ్ సాంగ్స్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా లో ఓ పాటలో నేను పక్కా లోకల్ అంటూ ఆమె స్టెప్పులు వేసింది.


ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే తనకెంతో దగ్గరగా ఉండే స్నేహితుడు కావడంతో అప్పట్లో ఆ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించినట్లు కాజల్ చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత కాజల్ మరే సినిమాలో కూడా ఐటం సాంగ్ లో నటించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించడానికి సిద్ధమవుతుందని టాక్. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.


పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ లు కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ ని సంప్రదించినట్లు సమాచారం. మరి కాజల్ అగర్వాల్ ఈ ప్రపోజల్ కి ఒప్పుకుందో లేదో అన్నా స్పష్టత మాత్రం ఇంకా బయటకు రాలేదు. గతంలో కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్తో ఆర్య 2 మరియు ఎవడు సినిమాలలో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: