సినీ పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లను గోల్డెన్ లెగ్ అంటారు..ఎందుకంటే వీరు నటించిన ఏ సినిమా అయినా అన్నీ కలిసి వచ్చి మంచి హిట్ అవుతుంటాయి.  మరికొంత మంది హీరోయిన్లు ఎంత పెద్ద స్టార్ తో నటించిన అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోతుంటాయి.  టాలీవుడ్ ఇప్పుడు అక్కినేని సమంతకు గోల్డెన్ టైమ్ నడుస్తుంది. అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఫుల్ జోష్ మరింత పెంచింది.  ఆమె నటించిన ప్రతి సినిమా విజయం అందుకోవడం ఇందుకు ఉదాహారణ.  తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ సినిమాలో నటిస్తుంది. 


ఈ సినిమాలో సమంత సరసన కొద్ది రోజులుగా ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న హీరో నాగ శౌర్య నటిస్తున్నాడు.   ఈ సినిమాలో మరో సీనియర్ నటి లక్ష్మి కూడా కీలక పాత్ర పోషిచింది.  వరస ప్లాప్స్ తో ఉన్న నాగ శౌర్య కి ఇప్పుడు ‘ఓ బేబీ’ తో సమంత హిట్ కొట్టి నాగ శౌర్య కి హిట్ ఇస్తుందా లేద ఫ్లాప్ ఇస్తుందా అన్నదానిపై టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి.

ఆ మద్య  ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాల తర్వాత ఒక్క హిట్ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నితిన్ కి సమంతతో కలిసి ‘అ.. ఆ’ సినిమా నటించారు..ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సమంత అక్కినేని క్రేజ్, దర్శకుడు త్రివిక్రమ్ మాయాజాలంతో అ.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సమంతతో కటిసి ఓ బేబి సినిమాలో నటిస్తున్న నాగౌశౌర్యకు అలాంటి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా..లేదా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: