'యువరాజ్ సింగ్'.. రాబోయే తరాల్లో పుట్టుకొచ్చే  క్రికెట్ అభిమానులకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు ఇది.  2007  T20 వరల్డ్ కప్ అలాగే  2011 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అనే కంటే.. 'యువరాజ్ సింగ్' గెలిపించాడు అనడం  కరెక్టేమో.  అయితే  తాజాగా  యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 


యువీ తన రిటైర్మెంట్ ను ప్రకటించి తన  అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేశాడు. ముఖ్యంగా  యువీ  రిటైర్మెంట్ ఇలా జరగడం బాధ కలిగించే అంశమే. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన  ఓ గొప్ప క్రికెటర్  ఇలా టీంలో స్థానం కోల్పోయి.. కెరీర్ ను ముగించడం క్రికెట్ ప్రేమికులకు ఏ మాత్రం రుచించడం లేడు.  యువీ కెరీర్ లో ఎన్నో నాటకీయ కోణాలు చోటు చేసుకున్నాయి.


తిరుగులేని క్రికెటర్ గా కొనసాగుతున్న టైంలో  క్యాన్సర్ వ్యాధి భారిన పడటం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత అభిమానుల కలలు కన్న ప్రపంచ కప్ ను సాధించ పెట్టడం,  తన సహచర ఆటగాడైన  దోనీ  తనను జట్టులో నుండి తొలిగించి అవమానించడం.. వంటి ఎత్తుపల్లాలను చూశాడు  యువీ. బహుశా ఇంత డ్రామా ఏ క్రికెటర్ లైఫ్ లో జరిగి ఉండకపోవచ్చు.  


ఒక సినిమాకి కావాల్సినంత డ్రామా ఉన్న 'యువీ' లైఫ్ ఆధారంగా  బయోపిక్ వస్తే.. అభిమానులతో పాటు   భవిష్యత్తు క్రికెటర్ లకు కూడా  ఆ చిత్రం  ప్రేరణగా నిలుస్తోంది.  మరి త్వరలోనే యువీ  బయోపిక్ రావాలని ఆశిద్దాం. ఏమైనా మరొక్కసారి యువీకి మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్.  


మరింత సమాచారం తెలుసుకోండి: