సాహో మానియా మొదలైంది.  సోషల్ మీడియాలో సాహో టీజర్ రిలీజ్ డేట్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.  ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని సమాచారం.  సాహో కోసం వేలమంది మంది కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించారు.  అయితే, సాహో కథ గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  


హీరో కుటుంబాన్ని ఓ వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తాడు.  ఆ వ్యక్తిని పట్టుకోవడానికి హీరో నకిలీ స్పై గా మరి అతడిని వెంటాడి పట్టుకుంటాడు.  స్పై గా మారడానికి హీరో ఏం చేశాడు... ఎలా స్పైగా మారాడు.. అన్నది కథ.  ఈ లైన్ వింటుంటే చాలా వీక్ గా ఉన్నది.  వీక్ పాయింట్ ను బేస్ చేసుకొని సినిమాను ఎలా తెరకెక్కించారో అర్ధం కావడం లేదు.  


కేవలం యాక్షన్ బేస్ చేసుకొని సినిమాను చిత్రీకరిస్తున్నారు.  కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.  ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దాదాపు 300 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తెరకెక్కుతోంది.  


ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది.  ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.  చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో.. 


మరింత సమాచారం తెలుసుకోండి: