నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో వేడుకలు జరుపుకున్నారు. ఆస్పత్రిలో కేన్సర్ బారిన పడిన చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు నందమూరి హీరో. 


పుట్టిన రోజు వేడుకల్లో మాట్లాడిన బాలయ్య.. బర్త్ డే రోజు తనను అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని.. అందరికీ వయసు పెరుగుతోంది.. కానీ తనకు తగ్గుతోందని చెప్పానన్నారు. ఇకపై తనను అలాగే విష్ చేయాలని ఫోన్ చేసిన వారితో చెప్పారట. బాలయ్య వ్యాఖ్యలతో ఒక్కసారిగా అక్కడ నవ్వుల పువ్వులు పూశాయి. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా సేవ చేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ. ఈ అవకాశాన్ని తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. 


ఇటు బాలయ్యకు సీని, రాజకీయ, వ్యాపార ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి లోకేష్, హీరో మంచు మనోజ్‌తో పాటూ అందరూ విషెస్ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: